5764) ఈ జీవిత కడలిలో భారమైన బ్రతుకులో నీవు నాకు తోడుంటే

** TELUGU LYRICS **

ఈ జీవిత కడలి లో భారమైన బ్రతుకులో 
నీవు నాకు తోడుంటే చాలు యేసయ్య 
అలల సుడిగాలులలో బ్రద్దలైన నావలో 
చుక్కాని నీవైతే చాలు యేసయ్య 
ఏదైన చేయగలవు యేసయ్య 
లేదు నీకు అసాధ్యము మెస్సయా

గాఢాంధకారములోన ఒంటరైన సమయాన 
దావీదుకు తోడై నిలచి నడిపించిన దైవమా 
ఆ చీకటి తొలగించి వెలుగును ప్రసరింపచేసి 
అల్పుడైన దావీదుని రాజుగా నీవు చేసినావే 
ఏదైనా చేయగలవు యేసయ్య 
లేదు నీకు అసాధ్యము మెస్సయా  

బానిసగా అమ్మబడి అనాధగా విడువబడి
చెరసాలలో వేయబడినా యోసేపును చూసినావే
ఐగుప్తు దేశములోనే శ్రేష్ఠమైన స్థానమునిచ్చి
ఘనముగా నిలిపిన నీవు ఘనుడైన దేవుడవు 
ఏదైనా చేయగలవు యేసయ్య 
లేదు నీకు అసాధ్యము మెస్సయా  

నా పాపబ్రతుకును చూసి ఆ దివ్య భాగ్యం విడచి 
నా కోసమే మరణించి నన్ను రక్షించినావే
యుగయుగములు నీతో కలసి సహవాసము చేయుటకు 
త్వరగా రానైయున్న మేఘర్హుడవు నీవే 
అంతము వరకు నా పయనం కొనసాగిస్తా 
తరతరములు నీతో కలిసి నే జీవిస్తా

----------------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune, Vocal : Pastor Jafanya Aduri
----------------------------------------------------------------