5731) ధవళవర్దుడా రత్నవర్దుడా పదివేలమందిలో గుర్తింపదగినవాడా

** TELUGU LYRICS **

ధవళవర్దుడా రత్నవర్దుడా పదివేలమందిలో గుర్తింపదగినవాడా
పరిశుద్ధుడా విమోచకుడా పాపులకై ప్రాణమిడిన యేసునాధా
అందుకో మాదుస్తుతి ప్రాణనాధా

ధరియించినావు మాంసయుక్తదేహము - భరియించినావు మాదుపాపశిక్ష
శాపగ్రహివై మ్రానునవేలాడినావు - రక్తమంతకార్చి క్రయముకట్టినావు

లేతమొక్కవోలె తండ్రియెదుట పెరిగావు - పాపరహితుడవుగా పరిపూర్ణుడవుగా
వ్యసనాక్రాంతుడవై మొత్తబడినావు - గాయములుపొంది మమ్ముస్వస్థపరిచావు

కొరడాలతోకొట్టినా వీపుపై గుద్దినా - ముఖముపై ఉమ్మినా వెంట్రుకలే పెరికినా
నిందకు నీహృదయం బ్రద్దలే అయినా - మౌనమేదాల్చావు ప్రాణమే పెట్టావు

నరులచేత పురుగువలె ఈసడింపబడితివి - గేలిచేయబడితివి విడనాడ బడితి
సొగసు సురూపమును కోల్పోయినావు - ఒసగినావు మాకు రక్తణాంబరములు

మాకుబదులు మరణించి నెరవేర్చినావు-తండ్రిచిత్తమంతా లేఖనమునంత
బుజువుచేసినావు మృతిని గెల్చినీవు - పరిశుద్ధుడవని జీవాధిపతివని

----------------------------------------------------
CREDITS : Vocals : Nissy John
Music : Prince Sikha
Lyrics and Tune : Janga Shadrack
----------------------------------------------------