5724) బరువగు సిలువకొయ్య భుజమున మోపిరయ్య

** TELUGU LYRICS **

బరువగు సిలువకొయ్య భుజమున మోపిరయ్య 
ఎంతగ నలిగినావయ్యా యేసయ్యా 
నా ప్రతి శాపం భరియించుటకు 
కలువరి మెట్టవరకు నడచినావయ్యా

పదునగు ముళ్ళ తీగతోటి మకుటము తలకు చుట్టినారా 
నా అవమానం దొర్లించితివా 
భారం రోగం తొలగెను నీద్వారా దేవకుమారా

చిరకను చేదు నీట ముంచి త్రాగను నోటికిచ్చినారా 
నా అపరాధం చెల్లించితివా 
క్షేమం జీవం కలిగెను నీద్వారా దేవకుమారా

ముఖమును ముసుగువేసి కప్పి రాజని పిలిచి కొట్టినారా 
నా అపచారం మన్నించితివా 
విజయం అభయం దొరికెను నీద్వారా దేవకుమారా

-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Dr. A.R.Stevenson
-------------------------------------------------------------------------------------------