** TELUGU LYRICS **
ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల
అని తెలిపెను బైబిలు ఎప్పుడో
యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే
గంతులు వేసెను గర్భంలో అప్పుడే
గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు
యేసు కంటే ముందుగా వచ్చినాడితడు (2)
లోకంతో పని ఎందుకు తనకు
దేవుని పనులే ముఖ్యం తనకు
క్రీస్తు సువార్తను స్థిరపరచ్చుటకు
పరలోకం కొరకు (2)
||ప్రతి శిశువుకు||
అని తెలిపెను బైబిలు ఎప్పుడో
యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే
గంతులు వేసెను గర్భంలో అప్పుడే
గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు
యేసు కంటే ముందుగా వచ్చినాడితడు (2)
లోకంతో పని ఎందుకు తనకు
దేవుని పనులే ముఖ్యం తనకు
క్రీస్తు సువార్తను స్థిరపరచ్చుటకు
పరలోకం కొరకు (2)
||ప్రతి శిశువుకు||
మారుమనస్సు పొందమనీ
తగిన ఫలము ఇవ్వమనీ
బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే
అరణ్యములో కేకలు వేయు యోహాను యొక్క శబ్దమనీ
ముందుగా యెషయా ప్రవచించినవాడితడే
తన వెనుక వచ్చినవాడే సర్వ శక్తిమంతుడనీ
తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదనీ
తననే తానే తగ్గించుకుని - అడవిలో బ్రతుకును సహియించుచుకొని
దేవుని ఎదుట మెప్పించుకుని - ఇల యేసును చూపాడని (2)
స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే
ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే
లేఖనాలతోనే చేయుటకు వచ్చినవాడే
రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే
లోకపాపములను మోసే గొర్రె పిల్ల - అతడే అనీ
ప్రభును గూర్చి సాక్షమిచ్చి - శిష్యులను ప్రభుతో పంపి
తండ్రుల హృదయము పిల్లల వైపుకు
పిల్లల హృదయము తండ్రుల వైపుకు
మనుషుల హృదయం దేవుని వైపుకు
త్రిప్పెను చివరకు (2)
-----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Dharmashali K. Lazarus Prasanna Babu
Tune, Music Composed By : Dharmashali K
Vocals : Vishnu Ram, Prithwi Bhat
-----------------------------------------------------------------------------------------