5676) నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా

** TELUGU LYRICS **

నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా 
నీ కృప నాకుండగా దేవా వెనుక నే చూడను 
నీ కృప నాకు చాలును దేవా 
బలహినతలో జయము పొందేద (2)
కృప... కృప... కృప... కృప.. యేసు నీ కృప 

అందరు నన్ను నిందించినను 
నను నమ్మి నాతో నడిచితివయ్యా 
నీ కృప నాకు చాలనిపలికి 
అభిషేకించి నడిపించుచున్నారు 
కృప.. కృప.. కృప.. కృప.. యేసు నీకృప 

బలహినుడను ఎన్నికలేనివాడను 
పాపంలో పడి నశించిపోగా
నన్ను బలపరచి యెగ్యునిగా ఎంచి 
నీదు సేవలో నిలిపితివయ్యా 
కృప.. కృప.. కృప.. కృప యేసు నీ కృప 

నా అతిశయము నీవేనయ్యా 
జీవితాంతము నీకై పాడేదా 
ఎన్నడు పాడనీ ఈ కంఠాన్ని
నీదు మహిమతో నింపితిరయ్యా 
కృప.. కృప.. కృప.. కృప యేసు నీ కృప

---------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Raja Mandru
Vocals : Bro. Bharath Mandru, Bro. Raja Mandru
---------------------------------------------------------------------------