5666) నీ కృపయే నన్ను బలపరచెను యేసయ్యా

** TELUGU LYRICS **

నీ కృపయే నన్ను బలపరచెను యేసయ్యా 
నీ కృపయే నన్ను రక్షించెను
ప: దూరము కాదెన్నడూ నీ కృప నాకు దూరము కాదెన్నడు 
నాపై జాలిని చూపి నన్ను క్షమియించిన నన్ను రక్షించిన నీ కృప
అ:ప: శాశ్వతమైన ప్రేమను చూపించావు 
కనుక విడువక నాయెడ నీకృపచూపించావు (యేసయ్య)  (2)

పాపము వలన నేను పొందిందినది మరణం జీతముగా 
నీ కృపవలన నాకు దొరికినది జీవం ఉచితముగా 
అపరిమితమైన నీ కృప నాపై ఉదయించెను 
వాక్యమై ఉన్న నీ కృప నాకై మరణించి లేచెను 
సత్యమైయున్న నీ కృప నాలో నివసించుచుండెను 
సజీవమైయున్న నీ కృప నన్ను త్వరలో కొనిపోవును
||శాశ్వత||

పాపము వలన నేను పొందినది దాస్యం ఉగ్రతకై 
నీ కృపవలన నాకు దొరికినది విడుదల స్వతంత్రముకై 
ఉత్తమమైనది నీ కృప జీవముకంటెను 
మహోన్నతమైనది నీ కృప నన్ను బ్రతికించెను 
శాశ్వతమైనది నీకృప నను విడువక తోడుండెను 
పరిశుద్ధమైనది నీ కృప నను నీబిడ్డగా నిల్పెను
||శాశ్వత||

పాపము వలన నేను పొందినది శాపం వ్యర్థునిగా 
నీకృప వలన నాకు దొరికింది భారం ఆత్మల రక్షణకై 
నమ్మకమైన నీ పనిలో నను నిలిపినది నీ కృప 
బలహీనతలో నాకు చాలును బలమిచ్చు నీ కృప 
సమయోచితమగు సహాయము అందించినది నీ కృప 
కృపను వెంబడి కృపచేత స్థిరపరచినది నీకృప
||శాశ్వత||

** ENGLISH LYRICS **

Nee Krupaye Nannu Balaparachenu Yaesayyaa 
Nee Krupaye Nannu Rakshinchenu
Chorus: Dooramu Kaadhennadoo Nee Krupa Naaku Dooramu Kaadhennadu 
Naapai Jaalini Choopi Nannu Kshamiyinchina Nannu Rakshinchina Nee Krupa
Verse: Shaashvathamaina Praemanu Choopinchavu 
Kanuka Viduvaka Naayeda Neekrupachoopinchavu (Yaesayya) (2)

Paapamu Valana Naenu Pondhindinadhi Maranam Jeethamugaa 
Nee Krupavalana Naaku Dorikinadhi Jeevam Uchithamugaa 
Aparimithamaina Nee Krupa Naapai Udhayinchenu 
Vaakyamai Unna Nee Krupa Naakai Maraninchi Laechenu 
Sathyamaiyunna Nee Krupa Naalo Nivasinchuchundenu 
Sajeevamaiyunna Nee Krupa Nannu Thvaralo Konipovunu 
||Shaashvatha||

Paapamu Valana Naenu Pondhinadhi Daasyam Ugrathakai 
Nee Krupavalana Naaku Dorikinadhi Vidudhala Svathanthramukai 
Uthamamainadhi Nee Krupa Jeevamukantenu 
Mahonnamathainadhi Nee Krupa Nannu Brathikinchenu 
Shaashvathamainadhi Neekrupa Nanu Viduvaka Thodundenu 
Parishuddhamainadhi Nee Krupa Nanu Neebiddagaa Nilpenu 
||Shaashvatha||

Paapamu Valana Naenu Pondhinadhi Shaapam Vyarthunigaa 
Neekrupa Valana Naaku Dorikindhi Bhaaram Aathmala Rakshanakai 
Nammakamaina Nee Panilo Nanu Nilipinadhi Nee Krupa 
Balahinathalo Naaku Chaalunu Balamicchu Nee Krupa 
Samayochithamaghu Sahaayamu Andhinchenadhi Nee Krupa 
Krupanu Vembadi Krupachetha Sthiraparachinadhi Neekrupa 
||Shaashvatha||

----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pastor J. Kumar
Vocals & Music : Nissi John & Jakie Vardhan
----------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post