5667) జయసంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా

** TELUGU LYRICS **

జయసంకేతమా దయా క్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్యా (2)
అపురూపము నీ ప్రతి తలపూ
అలరించిన ఆత్మీయ గెలుపూ(2)
నడిపించే నీ ప్రేమ పిలుపు 
||జయ సంకేతమా|| 

నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు సర్వము సమకూర్చే నే (2)
నన్నేల ప్రేమించ మనసాయను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైన నీ రుణము తీర్చేదెలా 
నువ్వు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించెద నా యజమానుడా సేవించెద నా యజమానుడా
||జయ సంకేతమా|| 

నిలిచెను నా మదిలో నీ వాక్యమే 
నాలోన రూపించె నీ రూపమే (2)
దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపం వెలిగించగా 
రగిలించే నాలో స్తుతి జ్వాలను భజించి నిన్నే కీర్తింతును 
జీవిత గమనం స్థాపించితివి సీయోను చేర నడిపించుమా సీయోను చేర నడిపించుమా
||జయ సంకేతమా|| 

నీ కృప నా యెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమిదీ (2)
నీ కృప నాకు తోడుండగా 
నీ సన్నిధి నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా 
కొదువేమి లేదాయే నాకెన్నడు
ఆత్మ బలముతో నన్ను నడిపించే 
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా
||జయ సంకేతమా|| 

** ENGLISH LYRICS **

Jaya Sankethama, Daya Kshethrama
Nannu Palinchu Naa Yesayya (2)
Apuroopamu Nee Prathi Thalapoo
Alarinchina Aathmeeya Gelupoo (2)
Nadipinche Nee Prema Pilupu
||Jaya Sankethama||

Nee Prema Naalo Udayinchaga
Naa Koraku Sarvamu Samakoorche Nee (2)
Nannela Premincha Manasayanu
Nee Manasento Mahonnathamu
Konchaina Nee Runamu Theerchedela
Nuvvu Leka Kshanamaina Bratikedela
Virigi Naligina Manasutho
Ninne Sevincheda Naa Yajamanuda Sevincheda Naa Yajamanuda
||Jaya Sankethama||

Nilichenu Naa Madilo Nee Vaakyame
Naalona Roopinche Nee Roopame (2)
Deepamu Naalo Veliginchaga
Naa Aathma Deepam Veliginchaga
Ragilinche Naalo Stuthi Jwaalanu
Bhajinchi Ninne Keerthinthunu
Jeevitha Gamana Sthaapinchatavi
Siyonu Chera Nadipinchuma Siyonu Chera Nadipinchuma
||Jaya Sankethama||

Nee Krupa Naa Yedala Vistaarame
Enadu Thalavani Bhaagyamide (2)
Nee Krupa Naaku Thodundaga
Nee Sannidhi Naaku Needayenu
Ghanamaina Kaaryamulu Neevu Cheyaga
Kodavemi Ledaye Naakennadu
Aathma Balamutho Nannu Nadipinche
Naa Goppa Devudavu Neevenayya Bahu Goppa Devudavu Neevenayya
||Jaya Sankethama||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------