5678) అద్వితీయుడా ఆశ్రయదుర్గమా ఏమున్నా లేకున్నా నీ మాట చాలయ్య

** TELUGU LYRICS **

అద్వితీయుడా ఆశ్రయదుర్గమా
ఏమున్నా లేకున్నా నీ మాట చాలయ్య 
అతిశ్రేష్ఠడా రక్షణధారమా
ఎవరు చూపించలేని నీ ప్రేమ చాలయ్య 
అన్నియు నీవే నాకంతయు
నీవే ఆధారం నీవే ఆనందం నీవే (2)

ఈ లోకంలో  పాపపు బంధీనై 
నీ ప్రేమను మరచి నే తిరుగగా 
సిలువలో నాకై మరణించి
నీ మహిమైశ్వర్యముకై పిలిచావయ్య 
ఇక భయపడను నేను ఎదురేమున్నా 
జయగీతం పాడుచు కొనసాగెదా
అన్నియు నీవే నాకంతయు
నీవే ఆధారం నీవే ఆనందం నీవే (2)

నా దోషములు నన్ను చుట్టుకొనగా 
నీకృప చూపి నన్ను విడిపించగా
నా హృదయం నాలో ఉల్లసించాగా
నీ ప్రేమను చాటగ నే వెళ్లేదా 
ఇక వెనుదిరుగను నేను ఏదేమైనా
విశ్వాసం తో నేను ఎదురీరెదా
అన్నియు నీవే నాకంతయు
నీవే ఆధారం నీవే ఆనందం నీవే (2)

---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Satya Medidhi 
Vocals & Music : Bro.Surya Prakash & Nani Mohan Karra
--------------------------------------------------------------------------------------