5583) యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు

** TELUGU LYRICS **

యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు 
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు (2)
విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము 
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు 
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు 
నీవే నా ప్రాణం - నీవే నా జీవం 
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం (2)

చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు 
చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు (2)
చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు 
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా 
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా 
నీవే నా ప్రాణం - నీవే నా జీవం 
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం (2)

హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు 
అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు (2)
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు 
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా 
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా 
నీవే నా ప్రాణం - నీవే నా జీవం 
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం (2)

నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా 
మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు (2)
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా 
నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా 
నీవే నా ప్రాణం - నీవే నా జీవం 
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం (2)

----------------------------------------------------
CREDITS : Music : jk Christopher
Lyrics : Sis. Krupa Jebaraj
----------------------------------------------------