5594) పరలోక రాజ్యములో సౌందర్యుడా

** TELUGU LYRICS **

పరలోక రాజ్యములో సౌందర్యుడా 
పదివేల పురుషులలో అతి శ్రేష్ఠుడా
నీ రాణిగా కన్యనుగా సిద్ధమాయెదా
నీ పెండ్లి కుమార్తెగ నను ఏలుకొనుమా
||పరలోక||

ఇంపైన వాక్యముతో సొగసైన మాటలతో
ఎనలేని ప్రేమచూపి నన్ను ఆకర్షించావు 
ధగ ధగ మెరిసేటి నీ రాజ్యము చేర్చుటకు
వేవేల దూతల సైన్యముతో రాజుగా వచ్చెదవు
||నీ రాణిగా||

ఇంతని వివరించే వివరణకే అందని
అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడవు నీవు
అక్షయముగా మార్చుటకు నీ మహిమకు పిలిచితివి
నిను చూడాలని మదిలోన దాహముతో ఉన్నా
||నీ రాణిగా||

ప్రధానదూత శబ్ధముతోనూ ఆర్భాటముగా బూరతోనూ
మేఘముల మీద దిగివచ్చే ఆ ఘడియలలో 
ఆరోహణమాయెదను నిన్నే చేరెద యేసయ్యా

-------------------------------------------------------------------------------
CREDITS : Music, Tune : Daniel John 
Lyrics & Vocals : Bro.Prakash Garu & Surekha Garu
-------------------------------------------------------------------------------