5608) నీ కృప లేనిదే ఈ జీవితమే లేదయ్యా

** TELUGU LYRICS **

నీ కృప లేనిదే - ఈ జీవితమే లేదయ్యా 
నిలవరమైన కృపతో - ఓదార్చావయ్యా (2)
అక్షయమైనది - ఇది మార్పు లేనిది 
కల్మషమే లేనిది - నన్ను జయించినది 
అ.ప : ఇదే కదా నా యేసయ్య కృప 
నను క్షమియించి - నను రక్షించిన కృప (2)

కన్నవాళ్లే విడిచిన - విడువని నీ కృప 
తోబుట్టువులే మరచిన - మరువని నీ కృప 
ఏకాకిగా నిశీధిలో - అడుగులే తడబడిన వేళలో (2)
తోడైనది నీ కృపయే - ప్రకాశించినది నీ కృపయే (2)

ఆత్మీయులే తరచిన - తరగని నీ కృప 
బంధువులే వీడిన - వదలని నీ కృప 
ఒంటరిగా ఎడారిలో - కన్నీళ్లే త్రాగిన వేళలో (2)
ఓదార్చినది నీ కృపయే - పోషించినది నీ కృపయే (2)

-----------------------------------------------
CREDITS : Lyrics : Syam Noel 
Tune, Music : Bhanu Pala 
-----------------------------------------------