5607) నా యేసు దేవా ఆరాధనీయుడా ఆదిసంభూతుడా

** TELUGU LYRICS **

నా యేసు దేవా ఆరాధనీయుడా
ఆదిసంభూతుడా నవజీవితదాత (2)
ఓటమి ఎరుగని విజయవంతుడా 
ఓడిపోనియ్యక వెన్నుతట్టువాడా (2)
ఆ.ప : యేసు నీ నామం బలమైన దుర్గము
నే దాగియున్న నా విశ్రమస్థానము (2)

నా కాపరివై నీవుండగా ఇలలో నాకేమి కొదువ ఉండదు 
సమృద్ధిగా నన్ను దీవించినావు (2)
కలలో కూడా ఊహించలేని ఉన్నత జీవితము నాకిచ్చినావు (2)
నీలో ఆనందింతునయ్య తండ్రి నిన్నే ఆరాధింతునయ్య  
||యేసు నీ నామం||
                
మార్గమేదియు కానరాక మదిలో వేదనతో క్రుంగియుండగా
మార్గమై నన్ను నడిపించావు (2)
కీడైనా మేలైన నీవెటు నడిచిన నీ అడుగుజాడలే నా బాటలు (2)
నీ సాక్షిగా ఉండెదనయ్య తండ్రి నీ కొరకే బ్రతికెదనయ్య 
||యేసు నీ నామం||

నీ రక్షణతో నన్ను కప్పి ఆత్మానుభవముతో 
నీతి క్రియలతో నన్ను నింపితివి నీ మహిమకై (2)
నీ రూపమును నే పొందుటయే ఆత్మీయతలో సంపూర్ణత (2)
య తండ్రి నీలా జీవించెదనయ్య
||యేసు నీ నామం||

యేసయ్య యేసయ్య స్తుతి ఆరాధనా నీకేనయ్యా 
యేసయ్య యేసయ్య స్తుతి ఆరాధనా నీకేనయ్యా 

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music, Vocals : Pas N B Benny 
----------------------------------------------------------------------------