5587) నా జీవితం నీకోసమే దేవా నేనున్నది నీకోసమే

** TELUGU LYRICS **

నా జీవితం నీకోసమే దేవా 
నేనున్నది నీకోసమే 
నా జీవితం నీకోసమే దేవా 
బ్రతికున్నది నీకోసమే 

కొండలైన లోయలైన గాఢాంధకారంలైన 
నీతోనే నా జీవితం 
కటికమైనవే ఎదురైన కారు చీకటే నన్ను కమ్మిన 
ఆగదు ఇక నా పయనం

నా జీవితం పాపములో ఉన్నప్పుడు 
నీవు వచ్చి రక్షణ నాకు ఇచ్చావు 
నా జీవితం చీకటిలో ఉన్నప్పుడు 
నీవు వచ్చి నన్ను వెలిగించావు 
నీకే దేవా ఇక నా ఈ జీవితం 
చెక్కుము ప్రభువా పనికొచ్చే పాత్రగా నన్ను
నా జీవితం నీకోసమే దేవా 
నేనున్నది నీకోసమే 
నా జీవితం నీకోసమే దేవా 
బ్రతికున్నది నీకోసమే 

నా జీవితం ఎటువైపు పోనప్పుడు 
నీవు వచ్చి మార్గమై నడిపించావు 
నా జీవితం ఒంటరిలో ఉన్నప్పుడు 
నీవు వచ్చి నాకు తోడు ఉన్నావు 
నీవు తప్ప ఎవరూ లేరు ఈ లోకంలో 
అంకితం ఈ జీవితం ఇక నువ్వే సర్వం నాకు 
నా జీవితం నీకోసమే దేవా 
నేనున్నది నీకోసమే 
నా జీవితం నీకోసమే దేవా 
బ్రతికున్నది నీకోసమే 

కొండలైన లోయలైన గాఢాంధకారంలైన 
నీతోనే నా జీవితం 
కటికమైనవే ఎదురైన కారు చీకటే నన్ను కమ్మిన 
ఆగదు ఇక నా పయనం

-------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Jeevan Josh
Tune, Music : Asha Ashirwadh
-------------------------------------------------------------