5586) దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు

** TELUGU LYRICS **

దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు 
నీ ప్రతి అడుగడుగుగమనిస్తున్నాడు (2)
 
జీవ మార్గమును మరణ మార్గమును 
నీ ఎదుటే వుంచాడు 
మేలు కీడులను వివేచించి 
ముందడుగు వేయమన్నాడు 
ఆకాశాలకు ఎక్కిపోయినా 
అక్కడనూ వున్నాడు 
పాతాళములో దాక్కున్నా 
నీ పక్కనే వుండగలడు 
దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు 
నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2)

తప్పు కప్పుకొని తప్పించుకొనుట 
దేవుని దృష్టికి నేరం 
తప్పు ఒప్పుకొని దిద్దుకొనువాడు 
పొందుకొనును కనికరం 
నిలుచున్నానని తలచుకొనువాడు 
పడిపోకూడదు భద్రం 
పడి చెడిన వాడు నిలుచున్నానని 
ప్రకటించుటయే తంత్రం 
మరుగైనదేది దాచబడదురా 
బయటపడుతుంది సత్యం 
రహస్యమైనవి వెలుగులోన ప్రకటింపబడును 
ఇది తథ్యం 
దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు 
నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2)

మార్చలేవు యేమార్చలేవు 
ఆ దేవునికన్నీ విశదం 
గూఢమైన ప్రతి అంశమును గూర్చి 
విమర్శ చేయుట ఖచ్చితం 
ఉగ్రత దినమున అక్కరకురాని 
ఆస్తులన్నీ అశాశ్వతం 
వ్యర్థమైన ప్రతి మాటకూ 
లెక్క చెప్పక తప్పదు విదితం 
హృదయరహస్యములెరిగిన దేవుడు 
తీర్చే తీర్పులు శాశ్వతం 
భయభక్తులతో నడుచుకోవడమే 
మానవకోటికి ఫలితం 
దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు 
నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2)

జీవ మార్గమును మరణ మార్గమును 
నీ ఎదుటే వుంచాడు 
మేలు కీడులను వివేచించి 
ముందడుగు వేయమన్నాడు 
ఆకాశాలకు ఎక్కిపోయినా 
అక్కడనూ వున్నాడు 
పాతాళములో దాక్కున్నా 
నీ పక్కనే వుండగలడు 
దేవుడు వున్నాడు నిను చూస్తున్నాడు 
నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు (2)
దేవుడున్నాడు జాగ్రత్త

-------------------------------------------------
CREDITS : Vijay Prasad Reddy
-------------------------------------------------