** TELUGU LYRICS **
నా హృదయ సౌధములో - వశియించ రావా
నీ ప్రేమ కౌగిలిలో - నను చేర్చుకోవా
నా హృదయ సౌధములో - వశియించ రావా
నీ ప్రేమ కౌగిలిలో - నను చేర్చుకోవా
నీ ప్రేమ చవిచూడ - మధురాతి మధురం
ఏమిచ్చి నీ ఋణము - నే తీర్చగలనయ్యా
గళమెత్తి నిను - నే కీర్తింతునేసయ్యా
గళమెత్తి నిను - నే కీర్తింతునేసయ్యా
నీ ప్రేమ కౌగిలిలో - నను చేర్చుకోవా
నా హృదయ సౌధములో - వశియించ రావా
నీ ప్రేమ కౌగిలిలో - నను చేర్చుకోవా
నీ ప్రేమ చవిచూడ - మధురాతి మధురం
ఏమిచ్చి నీ ఋణము - నే తీర్చగలనయ్యా
గళమెత్తి నిను - నే కీర్తింతునేసయ్యా
గళమెత్తి నిను - నే కీర్తింతునేసయ్యా
||నా హృదయ సౌధములో||
చెవి పట్టి మెలిపెట్టి - చేతిలో వాతెట్టి
చేరువై చేరదీసి - చేయి పట్టి నడిపించి
చెవి పట్టి మెలిపెట్టి - చేతిలో వాతెట్టి
చేరువై చేరదీసి - చేయి పట్టి నడిపించి
చెడుతనపు చెఱ నుండి - విడిపించినావయ్యా
పరిమళ తైలముగా - నను మార్చినావయ్యా
నీ ప్రేమ ఎన్నటికీ - నే మరువనేసయ్యా
నువు లేక నా బ్రతుకే - శూన్యము మెస్సయ్యా
నీ ప్రేమ ఎన్నటికీ - నే మరువనేసయ్యా
నువు లేక నా బ్రతుకే - శూన్యము మెస్సయ్యా
చెవి పట్టి మెలిపెట్టి - చేతిలో వాతెట్టి
చేరువై చేరదీసి - చేయి పట్టి నడిపించి
చెవి పట్టి మెలిపెట్టి - చేతిలో వాతెట్టి
చేరువై చేరదీసి - చేయి పట్టి నడిపించి
చెడుతనపు చెఱ నుండి - విడిపించినావయ్యా
పరిమళ తైలముగా - నను మార్చినావయ్యా
నీ ప్రేమ ఎన్నటికీ - నే మరువనేసయ్యా
నువు లేక నా బ్రతుకే - శూన్యము మెస్సయ్యా
నీ ప్రేమ ఎన్నటికీ - నే మరువనేసయ్యా
నువు లేక నా బ్రతుకే - శూన్యము మెస్సయ్యా
||నా హృదయ సౌధములో||
పరమును వీడినీవు - పరుగున ఏతెంచి
అమ్మలా లాలించి - నాన్నలా ఆదరించి
పరమును వీడినీవు - పరుగున ఏతెంచి
అమ్మలా లాలించి - నాన్నలా ఆదరించి
ఏ మంచి లేని నన్ను - ఎంచి ప్రేమించినావయ్యా
నీ జీవ మార్గాన నన్ను - నడిపించావయ్యా
నీ ప్రేమ లేని నాడు - నే విగత జీవినయ్యా
ఎన్నడూ నన్ను నీవు - విడనాడకేసయ్యా
నీ ప్రేమ లేని నాడు - నే విగత జీవినయ్యా
ఎన్నడూ నన్ను నీవు - విడనాడకేసయ్యా
||నా హృదయ సౌధములో||
--------------------------------------------------------------------
CREDITS : Lyrics : G. Mary Lakshmi Devi
Vocals & Music : Daniel & Shyam Prabhakar
--------------------------------------------------------------------