5632) నా దుఃఖదినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో

** TELUGU LYRICS **

నా దుఃఖదినముల్ సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో 
నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో (2)
స్తుతియు స్తోత్రం నీకేనయ్యా - మహిమ ప్రభావం నా యేసయ్య (2)

నా అక్రమములు నా దోషములు నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను
నను చేరదీసి క్షమించి అపరాధములన్నియు చెరిపితివి
||స్తుతియు||
       
నా స్నేహితులు నా బంధువులు నా ప్రియులు నన్ను ఛీ కొట్టినను 
నను ఆదరించి ఘనపరిచి అక్కున నన్ను చేర్చుకొంటివి
||స్తుతియు||
       
నా సంకటములు నా సమస్యలు నా అప్పులు నన్ను చుట్టుముట్టినన
నను బలపరచి దీవించి అక్కరలన్నిటిని తీర్చితివి
||స్తుతియు||

--------------------------------------------------------------------
CREDITS : Music : Prakash Rex 
Lyrics, Tune, Vocals : M.S.Suneeth Vardhan 
--------------------------------------------------------------------