5634) మనకు బలమైయున్న దేవునికి ఆనంద గానము చేయుడి

** TELUGU LYRICS **

మనకు బలమైయున్న దేవునికి ఆనంద గానము చేయుడి (2)
యకోబు దేవున్ని బట్టి ఉత్సాహధ్వని చేయుడి
            
కీర్తన యెత్తుడి గిలక తప్పేట ఆ ఆ కొట్టుడి
ఆరాధించుడి ఆత్మతో సత్యముతో ఆరాధించుడి (2)
||మనకు బలమైయున్న||
    
కృప వలన సింహాసనము స్థాపింపబడెను
సత్య సంపన్నుడై దానిమీద కూర్చుండెను (2)
ఆయన జ్యోతులను నిర్మించినవాడు (2)
నా పూర్ణహృదయముతో ఆరాధింతును (2)
||కీర్తన యెత్తుడి||

ఇశ్రాయేలీలకు కాపరి మందలె
యోసేపును నడిపించినవాడ (2)
కెరూబుల మీద ఆసీనుడైనవాడ (2)
నీ పరాక్రమముతో నన్ను నడిపించుము (2)
||కీర్తన యెత్తుడి||

నీవు ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లి తెచ్చితివి 
దాని నీడ కొండలనుకప్పియుండెను (2)
దాని తీగెలు వృక్షములనుఎక్కేను (2)
దాని రెమ్మలు వ్యాపించెను (2)
||కీర్తన యెత్తుడి||

----------------------------------------------------------
CREDITS : Music:  Tony Prakash
Lyrics, Tune : Pastor V. Yesurathnam
----------------------------------------------------------