** TELUGU LYRICS **
యూదయా దేశపు బెత్లెహేములో
రాజులకు రాజు పుట్టినాడు అంట
బంగారు సాంబ్రాణి బోళాములూ
జ్ఞానులు రాజునకు తెచ్చినారు అంట (2)
గొల్లలు నాట్యాలు చేశారంట
ఊరంతా శుభవార్త చాటా రంట
రండి రండి రారండి రాజును చూసొద్దాం
రండి రండి రారండి రాజుని పూజిద్దాం (2)
జగములునేలే రారాజే మన కోసం
దీనినిగా పుట్టినాడు అంట
పాపిని ప్రేమింప ఈ భూమికి
పరమాత్ముడే వచ్చినాడుగా
పరిశుద్ధుడై పసి బాలుడై
మరియమ్మ ఒడిలో పవళింపగా
ఆనందమే పరమానందమే
ఈ లోకమంతా సంతోషమే (2)
||రండి రండి||
సర్వోన్నతమైన స్థలములలో దేవాది దేవునికి నీత్య మహిమ
ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము (2)
పరలోక సైన్య సమూహముతో నీ కీర్తినే కొనియాడగా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నీ మహిమ నే ప్రకటించేదా (2)
రండి రండి రారండి రాజుని చూసొద్దాం
రండి రండి రారండి రాజుని పూజిద్దాం
||యూదయ దేశపు||
------------------------------------------------------------------
CREDITS : Music : Davidson Gajulavarthi
Lyrics & Vocals : K.Divya Radha & Mercy
------------------------------------------------------------------