5521) నింగిలో మెరిసింది ఒక తార వింతగా

** TELUGU LYRICS **

నింగిలో మెరిసింది ఒక తార వింతగా
జాడతో చెప్పింది ఆ తార కొత్తగా 
రక్షకుడు పుట్టినాడని లోకాన వెలసినాడని 
భూమి పులకించి పోయిందంట 
కోటి రాగాలు పాడారంట 
రక్షకుడు పుట్టినాడనీ లోకాన వెలసినాడని

సంతోషాలే నంటా మరి దుఖము లేనే లేదంట 
పాపులను రక్షింప యేసు పుట్టాడంటా 
ఆనందాలేనంటా ఇక ఆర్భాటాలేనంట 
పరలోక పుత్రుడంట పుడమిని పుట్టేనంట 
పలికిన ప్రవచనాలు నెరవేరాయంట 
లోకమంత పావనమాయే రక్షకుడు ఇల జన్మించాడంటా
కోరస్: 
తూర్పుదేశ జ్ఞానులంత చేరిరంట కానుకలర్పిచారంట 
పరలోక దూతలు గానాలు పాడియేసును పూజించారంట 
అందాల బాలయేసుకు జోలలు పాడారంట 
గుండెనిండ సంతోషాలతో ఆనందించారంట

గొల్లలు చూసేరంట గంతులు వేసేరంట 
లోకాలనేలే రాజను పూజించేసారంట 
జ్ఞానులు వచ్చేనంట కానుకలిచ్చేరంట 
పావన పుత్రుడని పరవశించెనంట 
పరమును విడిచి యేసు భువికేగేనంట 
లోకపాప భారమునంత తన భుజమున మోయడానికంట

---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Sunil kumar 
---------------------------------------------------------------------