5485) లోకాలనేలేటి రారాజు యెసయ్యా నీ కొరకు జన్మించెను

** TELUGU LYRICS **

లోకాలనేలేటి రారాజు యెసయ్యా నీ కొరకు జన్మించెను 
పాపాశాపాన్ని తొలగించే మెస్సయ్య మన కొరకు దిగివచ్చేను (2)
ఈ లోకపాపమంతా తొలగించే ఏసయ్య 
మన శాపభారమంతా విడిపించే మెస్సయ్య 
మన కొరకై దిగివచ్చెను 
నీ కొరకై భూవికేగేను 

ఈ లోకయాత్ర యందు నిన్ను రక్షించాలని 
మరియమ్మ గర్భమందు బాలుడై జన్మించే (2)
నీ కొరకై జన్మించెను 
మన కొరకై భూవికేగేను (2)
రారండి జనులారా 
రారండి ప్రియులారా 
శ్రీ ఏసుని స్తుతీయించేదం
బాలుని కొనియాడేదం (2)

ప్రజలందరి జీవితాలలో నక్షత్రం వెలగాలని 
పశువుల పాకలోన పసివాడై ఉదయించే (2)
నీ కొరకై వెలిగించెను 
మన కొరకై ఉదయించెను (2)
రారండి జనులారా 
రారండి ప్రియులారా 
శ్రీ ఏసుని స్తుతీయించేదం
బాలుని కొనియాడేదం (4)

------------------------------------------------
CREDITS : 
------------------------------------------------