5418) దేవదేవుడే మనుష్యరూపిగా యేసు నామధారిగా ఇల జన్మించినాడుగా

** TELUGU LYRICS **

దేవదేవుడే మనుష్యరూపిగా 
యేసు నామధారిగా ఇల జన్మించినాడుగా 
దేవదూతలకే లేని భాగ్యము - మానవాళికీ ఒసగినాడుగా 
ధరలో ఎవ్వరును నశింపకూడదని ప్రేమతో రక్షించి - పరముకు చేర్చుటకు 
దేవదేవుడే ఇలకొచ్చినాడు (4)
నీకోసం నాకోసం అందరి కోసం 
ఆనందమే ఆర్భాటమే కోలాహలమే ఈ శుభవేళ (2)
తప్పెట పట్టి తాళం వేసి చేసేద్దామా 
ఊరువాడ వీధుల్లోన క్రిస్మస్ ఆరాధన (2)

చీకటిలో ఉండి మార్గమె తెలియని మానవాళిని చేర
చక్కని మార్గమున జనులను నడిపింప వెలుగుగా
చల్లని మోక్షము ప్రజలను చేర్చుటకు బాధ్యతతో జన్మించినాడు 

మరణపుచ్ఛాయలో మగ్గిపోయేటి - మానవాళి విడుదలకై అరుదెంచినాడు
మనిషిని సత్యములో జీవింప చేయుటకు - మాదిరి చూపగ జన్మించినాడు 
మరణమునే ఇల మరణింపచేయగా - మరణించి లేచుటకే పుట్టినాడు

----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro.P.Methushelah 
Vocals & Music : Singer Parvati & Bro.Sampath Kareti
----------------------------------------------------------------------------------