** TELUGU LYRICS **
బెత్లెహేములో పుట్టినాడు మరియకు పుట్టినాడు
పశువుల పాకలోన బాలుడై వెలసినాడు
ఆనాడు దూతలు బాలుని చూచి సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ అని పాడిరి
ఊరువాడ ఆనందిస్తూ లోకమంతా ఉల్లాసిస్తూ
రారాజు జన్మను తలుచుకుంటూ స్తోత్రించెదము
ఆనాడు దూతలు బాలుని చూచి సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ అని పాడిరి
ఊరువాడ ఆనందిస్తూ లోకమంతా ఉల్లాసిస్తూ
రారాజు జన్మను తలుచుకుంటూ స్తోత్రించెదము
తారలు కాంతులతో ఆకశన వెలుగుతూ
యేసు జన్మస్థలమునకు మార్గము చూపెను (2)
జ్ఞానులు కానుకలు బాల యేసుకు అర్పించుచు
లోక రక్షకుడా అదితీయుడని పాడుచు కీర్తించిరి (2)
జ్ఞానులు కానుకలు బాల యేసుకు అర్పించుచు
లోక రక్షకుడా అదితీయుడని పాడుచు కీర్తించిరి (2)
గాబ్రియేలు తెలిపిన సంతోష వార్తకు
గొల్లలు ఆనందముతో గంతులు వేసెను (2)
భయభీతులు వీడిరి శ్రీ యేసుని దర్శించిరి
పాప శాపాలను తొలగించిన దైవసుతుడని ఘనపరచిరి (2)
భయభీతులు వీడిరి శ్రీ యేసుని దర్శించిరి
పాప శాపాలను తొలగించిన దైవసుతుడని ఘనపరచిరి (2)
----------------------------------------------------------------
CREDITS : Music : Paul Enosh Manti
Lyrics, Tune, Vocals : K Sahana Sukrutha
----------------------------------------------------------------