5444) బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన

** TELUGU LYRICS **

బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు 
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు 
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
ఉల్లసింతుము - ఆరాధింతుము లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు పాపము బాపే మన యేసుని 

క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను 
దివి నుండి భువికి ఏతెంచెను యూదుల రాజుగా జన్మించెను 
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను 
||ఉల్లసింతుము||

నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో 
ఆరాధించిరి - బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను 
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను
||ఉల్లసింతుము||

-----------------------------------------------------
CREDITS : Lyrics : Nikhil Batthula
Tune and Music : Sam K Kiran 
-----------------------------------------------------