5369) నింగిలోని చుక్క తెచ్చెను నేడు ఎంతో సంతోషము

** TELUGU LYRICS **

నింగిలోని చుక్క తెచ్చెను నేడు ఎంతో సంతోషము
నింగిలోని దూత తెచ్చెను నేడు గొప్ప శుభవార్తను (2)
దావీదు కుమారుడు లోకాన్ని ఏలే రాజు 
పశువుల పాకలో జన్మించే మహారాజు (2).  
||ఆ నింగిలోన||

పాపపు బ్రతుకులను మార్చుటకు
లోకములో జన్మించే ఆ దేవుడు
నశించే ఆత్మలను రక్షించుటకు
రా రాజుగా జన్మించెను(2)
ఎన్నడు విడువడు 
ఎన్నడు ఎడబాయడు
ఎన్నడు విడువడు 
నిన్ను ఎన్నడూ ఎడబాయడు 
||దావీదు కుమారుడు||

రోగులకు స్వస్థత నిచ్చుట కు
ఇమ్మానుయేలు గా దిగివచ్చాడు
తన ప్రజల భుజములపై భారమును
తొలగించుటకు జన్మించెను(2)
నిజమైన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొను 
నిజమైన దేవుడని ప్రతి మోకాలు వంగును 
||దావీదు కుమారుడు||

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్😊😊.

-----------------------------------------------------------
CREDITS : Music : JK Christopher 
Lyrics, Tune, Vocals : Sis. Asha Jyothi 
-----------------------------------------------------------