5367) నీ కృపయే ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నను ఇలలో కాపాడినది

** TELUGU LYRICS **

నీ కృపయే ఇది నీ కృపయే 
ఇన్నాళ్ళుగా నను ఇలలో కాపాడినది 
బహు శ్రేష్టమైన ఈవులెఎన్నో దయచేసినది
నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది 
ఈ లోక బంధాలన్నీ మరిపించినది
 
పక్షిరాజువై నీ రెక్కలపై మోసి 
అందని శిఖరాలు ఎక్కించితివి 
నా కన్నీటిని - నీ పాత్రలో దాచి 
ఎడారిలోనా - సెలయేరు పుట్టించినది

కన్న తండ్రివై నీ ఆక్కున ననుచేర్చి
ఎన్నో అపాయాలు తప్పించితివి 
శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన
నీ నామమే ఊపిరై బ్రతికించినది

-------------------------------------------------------------
CREDITS : Thandri Sannidhi Ministries
-------------------------------------------------------------