5365) మనసా ఓ మనసా నీ ప్రియమైన యేసయ్యను

** TELUGU LYRICS **

మనసా ఓ మనసా - నీ ప్రియమైన యేసయ్యను
విరిగి నలిగినా - నిను మృదువుగ తాకిన ఆ ప్రేమను 
నమ్ముకో నీకు - నెమ్మది కలదు
సీయోనే నీకు స్థిర నివాసము స్థిర నివాసము

ఒంటరివని నీవు - కన్నీరు కార్చకు 
భయము నీకెందుకే - ఓ మనసా (2)
అతికాంక్షనీయుడు - జయమై నిలుపు కదా జయమై నిలుపు కదా

కృంగిపోకు - శ్రమలో నీవు
దిగులు నీకెందుకే - ఓ మనసా (2)
ప్రభువు నీకు - తోడై నడచు కదా తోడై నడచు కదా

యోగ్యము కాదు - ఈ లోకము నీకు 
తొందరపడకే - ఓ మనసా (2)
యేసయ్యే నీకు - జతగా నిలుచు గదా జతగా నిలుచు గదా

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------