5356) లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును

** TELUGU LYRICS **

లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును
సర్వదా నేను మీతో నుందును
సాసగాగ మమప సనిపమగా సాసగాగ మమప (2)
గమానిప మపాసని గాగసాసనిప మగసనిపమగా

కడరాత్రి భోజన వేళలో నా జ్ఞాపకార్థం చేయుమని
ఆదేశించిన క్రీస్తు బలి మనం ఏకమనస్కులై కొనియాడెదం
క్రీస్తుబలి ఇది జీవబలి 
క్రీస్తుబలి ఇది ప్రేమబలి 
క్రీస్తుబలి తన త్యాగబలి 
క్రీస్తుబలి మన రక్షణ బలి
||కడరాత్రి భోజన||

సనిసప సనిసప సనిపమగమపా
సనిసప సనిసప సనిపమగమపా
సగమ గమప మపని పనిస గ మపమగా సా

అప్పద్రాక్ష రసములనెత్తి కృతజ్ఞతా స్తోత్రముల్ పలికి
తన శరీర రక్తంగామార్చి పంచిఇచ్చిన జీవబలి (2)
బలియర్పింప వచ్చినప్పుడు కోప క్రోధ వైరము వదిలి 
క్షమా సమత సఖ్యత గలిగి  నిర్మల హృదయులై ఆరాధించు (2)
||క్రీస్తుబలి|| ||కడరాత్రి||

పూర్వ నిబంధనల బలులకన్నా శ్రేష్టమైన బలియాగమిది 
పాపవిమోచన పాపులరక్షణ ప్రేమతో నెరవేర్చిన ఈ బలి
నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు పరస్పరం ప్రేమింపమని
నూతన ఆజ్ఞను ప్రసాదించిన ప్రేమమయుని ప్రేమా (2)
||క్రీస్తుబలి||

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Fr.Binoy Kanayinkal
Vocals & Music : Rajesh Gole & Joseph Pasala
-------------------------------------------------------------------------