** TELUGU LYRICS **
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ గగనాన
పరలోక పుత్రుడు పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు (2)
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ

||రారే||
మనరక్షణార్ధమై మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు (2)
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు
మనరక్షణార్ధమై మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు (2)
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు
||రారే||
-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bapu Kondeti
Music & Singer : Vicky M & Lillian Christopher
-------------------------------------------------------------------------