5398) భూమికి నడి బొడ్డున పుట్టాడు విశ్వమంత పాలించే రారాజు

** TELUGU LYRICS **

భూమికి నడి బొడ్డున పుట్టాడు
విశ్వమంత పాలించే రారాజు
ఘన పర వైభవమునే విడిచాడు
మన పాప తిమిరము ను తరిమాడు
రండి రండి క్రీస్తు ను దర్శిద్ధాం
తూర్పు దేశ జ్ఙానుల వలె పూజిద్దాం
రండి రండి క్రీస్తు ను స్తుతియిద్దాం
గొఱ్ఱెల కాపరుల వలె ప్రకటిద్దాం

గగనమంత తనకు సింహాసనము
పుడమి అంత తనకు పాద పీఠము
పాదరక్షకైన పనికి రాని పాపికై
పుట్టెను శుద్ది చేయ పాప రహితుడై 

సృష్టి కి తన మాటయే శాసనము
తన మాటకు తొలగెను ప్రతి రోగము
మాట వినక మరణమైన దుష్ట నరునికై
పుట్టెను పరమ జీవమునిచ్చుటకై 

ప్రళయ జలముపై ఆయన సింహాసనము
బహు భీకరము ఆ యేసుని రాజసము
పశుప్రాయుడై చెడిన ప్రతీ మనిషికై 
పుట్టెను పశుశాలలో బలి అవ్వడానికై

-----------------------------------------
CREDITS : Vocal : Dinesh
Music : N.Thomas 
-----------------------------------------