5376) అంబరాన్ని తాకే సంబరాలు అంబరాన్ని తాకే సంబరాలు వచ్చేనండో

** TELUGU LYRICS **

అంబరాన్ని తాకే సంబరాలు    
అంబరాన్ని తాకే సంబరాలు వచ్చేనండో
రారండి జనులారా క్రీస్తుని వేడండి మనసారా
నింగిలోని తార పుడమిలోని సంబరం
అంబరాన్ని తాకే సందడి చేసింది ఊరురా పండుగ తెచ్చింది 
దైవ పుత్రుండు జన్మించినాడు 
లోకరక్షకుడు ఉదయించినాడు 

బెత్లహేము గ్రామములో కన్య మరియ గర్భమున జన్యించే శ్రీ యేసుడు
సమస్తపాపములు బాపగ మారెను మనిషిగా శ్రీమంతుడు
పరిశుద్ధుడు పావనుడు పూజకుయోగ్యుడు
దైవ పుత్రుండు జన్మించినాడు 
లోకరక్షకుడు ఉదయించినాడు

సర్వోన్నత స్థలములలో స్తోత్ర గీతముతో (ధ్వనులతో) దిగివచ్చే పరలోక వైభోగమే
గొల్లలు జ్ఞానులు ఆనంద భరితులై శిశువును పూజించిరి
పరిశుద్ధుడు పావనుడు పూజకు యోగ్యుడు 
దైవ పుత్రుండు పుట్టి నాడని ప్రచురింపవెల్లే నిజరక్షకుని

చీకటి బ్రతుకులలో నీతి సూర్యుడు మన కొరకు ఉదయించెను
దుఃఖమే లేని అంతము కాని రాజ్యం మనకిచ్చుటకు
నీ పాపము నా శాపము కొట్టివేయ వచ్చెను
మన పాప శాపమును భరియింప వచ్చెను
దైవ పుత్రుoడే పరము చేర్చును
నిత్య జీవమును మనకు ఇచ్చును

--------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Samuel Sukumar Gilakala
Music & Vocals : Abhishek Samuel. P & Achyut 
--------------------------------------------------------------------------------------