** TELUGU LYRICS **
ఆహా ఓహో ఏమి మా భాగ్యము
యేసు రాజును చూడ వచ్చినాము
నీవు ఇచ్చిన స్వరములతో మేము
యేసు రాజును స్తుతియింప వచ్చినాము
స్తుతియింపగా వచ్చినాము కీర్తింపగా వచ్చినాము (2)
గొర్రెలకు కాపరుల మైన మా కాపరివి నీవే కదా
దూతలు ప్రకటింపగా ఆ ప్రకటనకు లోబడి వచ్చినాము
త్రోవ తప్పి మేము తిరుగులాడుచున్నాము
సన్మార్గము చూపమని వేడుకొనుచున్నాము
గొప్ప గొప్ప జ్ఞానులమైన ఆ దైవాన్ని దర్శించగలమా
నక్షత్రము త్రోవ చూపగా ఆ మార్గంలో నడిచి వచ్చినాము
జ్ఞానులకే జ్ఞానివని ఒప్పుకొనుచున్నాము
రక్షించే రాజువని వేడుకొనుచున్నాము
ఏ విలువ లేకపోయినా నీ ప్రేమ పంచినావుగా
మా పాపం తొలగింపగా పుట్టిన దైవమని నమ్మినాము
మా క్రియలతో శుద్ధులం కాలేమనుచున్నాము
నీ రక్తంతో శుద్ధత కోరుకొనుచున్నాము

---------------------------------------------------------------------------------------
CREDITS : Bro. Vasu Moses, Christu Sainyam Ministries
--------------------------------------------------------------------------------------