5358) అదిగో తూర్పున తార లోకానికి వెలుగైన తార

** TELUGU LYRICS **

అదిగో తూర్పున తార
లోకానికి వెలుగైన తార
యేసు జననమే శుభదినo
ఉర్వి జనులకిదే ఉషోదయo

రక్షకుడే జన్మిoచగా
బెత్లహేములో పoడుగా

జ్ఞానులు కానుకలు సమర్పించిరి
గొర్రెల కాపరులు మోకరిల్లిరి
దేవదూతలె మహిమ పరచిరి
భూనివాసులే సంతసించిరి

చీకటి వెలుగుగా మారిపోయెను 
రక్షణ శృంగముగా నిలిచిపోయెను 
మరణమే ఇక అమరమాయెను
నిత్యజీవముకు మార్గమాయెను 

నా ఆత్మ నీలో ఆనందించును
నా ప్రాణము నిన్నే ఘనపరచును
దీనస్థితిలో దర్శించుము
నీ కృప నాపై కుమ్మరించుము

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------