5258) రాకడ సమీపించుచున్నది రాకడ త్వరలో రానై యున్నది

** TELUGU LYRICS **

రాకడ సమీపించుచున్నది
రాకడ త్వరలో రానై యున్నది
యేసే రాజుగా వచ్చుచున్నాడు
సిద్ధపడుమా ప్రియ సంఘమా 
ఏమరపాటుగా నీవు ఉండకుమా
ఎత్తబడుటకు నీవు సిద్ధమా

ఈ లోకం వ్యర్ధమని అంతయు మోసమని
గనుక గమనించే జీవించమని
తెలుపుటకు ఏతేంచి మాదిరిగా జీవించి
ఇలాగు ఉండమనే నేర్పించెన్ 
అయినా మారని జీవితము
కనుకే మారుము ఈ క్షణము
ఒప్పుకో చేసిన పాపమును
ఇదియే అనుకూలమైన సమయం.
నిన్ను మార్చి సరిచేసి
నవ జీవితాన్ని నీకు ఇచ్చును ప్రభు ఇలలో

సువార్త వినబడినా పెడచెవిన పెట్టావు
అవకాశమే చేయిజార్చుకున్నావు
ఎన్నేళ్ళు ఎన్నాళ్లు కొన్నాళ్లే అనుకుంటావు
చివరికి మిగిలేవి కన్నీళ్లు
తెంచుకో లోకముతో బంధం
పెంచుకో యేసుతో అనుబంధం
ధరణిలో ఏది కాదు సొంతం
పరమున చోటు నీకు ముఖ్యం
విశ్వాసం నీ సాక్ష్యం నీ ప్రార్ధనే
నిన్ను చేర్చును సదనముకూ

రాకడ సమీపించుచున్నది
రాకడ త్వరలో రానైయున్నది
యేసే రాజుగా వచ్చుచున్నాడు
సిద్ధపడుమా ప్రియ సంఘమా 
ఏమరపాటుగా నీవు ఉండకుమా
ఎత్తబడుటకు నీవు సిద్ధమా

--------------------------------------------------------------
CREDITS : Vocals : Surya Prakash
Music, Lyrics, Tune : Dr. Sam Jaysheel
--------------------------------------------------------------