5236) మంచివాడా నా యేసయ్య

** TELUGU LYRICS **

స్తుతి నీకే మహిమ నీకే
స్తుతి నీకే మహిమ నీకే
పల్లవి: మంచివాడా నా యేసయ్య
నే పాడు పాటకు కారణమా (2)
లాభము ఆశించి ఆదుకొనక
దీనుడను నన్ను నీవు మరువ లేదయ్యా (2)

స్తుతి నీకే మహిమ నీకే
కీర్తి ఘనతయు నీకేనయా (2)

ఎందరో మనుషులను చూశానయ్యా
ఒక్కరూ నిన్ను పోలి లేరయ్య (2)
నీవు లేని జీవితము వ్యర్థమయ్యా
మారని నీదు ప్రేమను మరువలేనయా (2)
||స్తుతి||

హృదయమంతయు ఎరిగితివి
నాలోని ఆశలను తీర్చితివి (2)
నీ సేవ మార్గములో నడిపితివి
కృంగి యున్న నాతో నీవు తోడైయుంటివే (2)
||స్తుతి||

స్తుతి నీకే మహిమ నీకే
కీర్తి ఘనతయు నీకేనయా
నీకే స్తుతి నీకే ఘనత
నీకే మహిమ నా యేసయ్యా

----------------------------------------------------
CREDITS : Music : Enoch Jagan
Vocals : Samy Pachigalla
----------------------------------------------------