4831) నూతనమైన చిగురు ఆశలతో చిగురించెదా స్థిర కాలం నీతో

** TELUGU LYRICS **

నూతనమైన చిగురు ఆశలతో
చిగురించెదా స్థిర కాలం నీతో (2)
ఆరాదించెదా ఆరాద్యూడా నీను
అల్పఒమేగా వని అనుదినం (2)                 
||నూతనమైన||

ఆధరన లేని నన్ను నీవు ఆదరించి
కల్వరి ప్రేమతోనే నన్ను ‌ప్రేమించావు (2)
అక్షయుడా నా ప్రేమ పూర్ణుడా 
సురక్షితముగా నన్ను కృపలో దాచావు (2)
సురక్షితముగా నన్ను కృపలో దాచావు
||నూతనమైన||

ఆపత్కాలమందు నేను మొర పెట్టగా 
ఉత్తరమిచ్చు తండ్రి నీవే (2)
అబ్రహాము దేవుడా నేమధి నీలోనయ్య (2)
పరిశుద్ధమైన స్థలంలో ధైర్యమునిచేదవు 
||నూతనమైన||

సీయోనులో నుండి  ఆదుకున్నవాడా
నా ప్రతి ప్రార్థనను ఆలకించువాడా (2)
సర్వోన్నతుడని కీర్తనలు పాడెద
సంతోషములతో స్తుతి గానం చేసేద (2)
సంతోషములతో స్తుతి గానం చేసేద  
||నూతనమైన||

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : D. Raju Anna & Rajesh
Music & Vocals : Sandeep Gella & Hepsiba Angel
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------------------------