4826) నిశీదిలో నేను ఉన్నాను యేసయ్యా నిరాశలో ఒడిలో

** TELUGU LYRICS **

నిశీదిలో నేను ఉన్నాను యేసయ్యా
నిరాశలో ఒడిలో పడియుండినయ్యా
విరాగవు వలలో చిక్కుకుంటినయ్యా
ఎడారిగ జీవితాన్ని మార్చుకుంటినయ్యా
యేసయ్యా యేసయ్యా
నీ కృపతో రక్షించినావయ్యా

మమతలు లేని లోకంలో మమతను పంచావు
మారా జీవితమును నీవు మధురం చేసావు
తల్లడిల్లు వేలలోన ప్రేమ చూపినావు
తల్లిలాగ లాలించి సేద తీర్చినావు

నా తలరాత ఇంతేనని నేననుకున్నాను
నా తోడెవరు లేరని నిరాశే చెందాను
కన్నీటిని కార్చగా కనికరించినావు
కారు చీకటంతా తీసి వెలుగు చూపినావు

--------------------------------------------------------------------------------
CREDITS :Lyrics, Tune, Music, Vocal : Y.SunilKumar
Youtube Link : 👉 Click Here
--------------------------------------------------------------------------------