4798) యేసయ్యా నీవు తప్ప వేరెవరున్నారు ఇలలో నాకెవరున్నారు

** TELUGU LYRICS **

యేసయ్యా నీవు తప్ప వేరెవరున్నారు ఇలలో నాకెవరున్నారు (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొను వాడవు..ఎంత మంచి దేవుడనీవయ్యా
అంతమ వరకు నీ సాక్షిగా నేనుండెదను    
||యేసయ్యా నీవు తప్ప||

నా వేదనలో నా శోధనలో నిట్టూర్పులలో నే పడియుండగా (2)
నీవే కదా గడచిన కాలమంతా నాతో నిలిచినది (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్తును.. ఏమివ్వలేని దీనుడను (2)
అందుకే ఈ ఆరాధన అందుకో నా హృదయార్పణ (2)
||యేసయ్యా నీవు తప్ప||

మరణమెయైన జీవమెయైన ఉన్నవియైన రాబోవునవైన (2)
ఎడబాపునా శ్రమలెన్నెదురైన నీ ప్రేమలోనుండి (2)
శ్రమకే కలిగెను అవమానము నాకు మిగిలెను ఆనందము (2)
అందుకే ఈ ఆరాధన అందుకో నా స్తోత్రార్పణ (2)
||యేసయ్యా నీవు తప్ప||

ఆర్భాటముతో దేవుని బూరతో ప్రధానదూత శబ్దముతోను (2)
నా కొరకే పరలోకమునుండి నీవు దిగివత్తువు (2)
రెప్పపాటులో నే మార్పునొంది  అక్షయుడా నే నిను చేరెదా (2)
ఈ నిరీక్షణ నే కలిగి ధైర్యము విడువక సాగెద (2)
||యేసయ్యా నీవు తప్ప||

----------------------------------------------
CREDITS : 
Youtube Link : 👉 Click Here
----------------------------------------------