** TELUGU LYRICS **
ఉన్నతుడా అత్యున్నతుడా
నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా (2)
పరిశుద్ధులలో మహానీయుడా - పదివేలలో అతి సుందరు
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే (2)
పరిశుద్ధులలో మహానీయుడా - పదివేలలో అతి సుందరు
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే (2)
ఆదియు అంతము నీవని - నీవు గాక మరి ఎవ్వరు లేరని (2)
నా తుది శ్వాస వరకు - నీ సేవయే నే చేయాలని
నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని (2)
||ఆరాధనా నీకే||
ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని (2)
నీ ప్రేమవార్తను ఇలలో - అలయకనే ప్రకటించాలని (2)
నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని (2)
ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని (2)
నీ ప్రేమవార్తను ఇలలో - అలయకనే ప్రకటించాలని (2)
నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని (2)
||ఆరాధనా నీకే||
------------------------------------------------
CREDITS : Paul Emmanuel
------------------------------------------------