4762) విడువలేనయా నీ పాదపద్మము మరువలేనయా నీ సన్నిధానము

** TELUGU LYRICS **

    విడువలేనయా నీ పాదపద్మము మరువలేనయా నీ సన్నిధానము (2)
    ఘనుడా నజరేతువాడ ప్రియుడా నా ప్రాణనాథ (2)
    స్తుతి ఘనత మహిమ ప్రభావము నీకే (2)

    గాతకాలమంత నీ నీడలోనె నన్ను దాచితివి
    కలనైనా నేను ఊహించలేని కార్యాలు చేసితివి (2)
    గర్భాన నను మోసిన తల్లి మరచెను,చేయి పట్టి నడిపిన నా తండ్రి విడచెను (2)
    అన్ని వేళలా నీ కంటిపాపలా నన్ను దాచినావు యేసయ్యా (2) 
    ||విడువ||

    ధరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో
    నా దోషమంత తొలగించినావు కడిగి నీ రుధిరములో (2)
    ఏనాడు నే మరువను నీ మేలులు నిత్యము నే చాటెద నీ ఉపకార్యములు (2)
    (నా)బ్రతుకు కాలము నిను ప్రస్తుతించగ నన్ను పిలచినావు యేసయ్య (2)
    ||విడువ||

------------------------------------------------------------
CREDITS : Music & Vocals : Eli Moses
Lyrics & Tune : John Chekravarthi 
------------------------------------------------------------