4817) నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా

** TELUGU LYRICS **

నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
నన్ను కాదనకు నా రక్షకా 
నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
నన్ను త్రోసేయకు నా యేసయ్య

ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా 
జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా 
పడిపోతున్నా - పాడైపోతున్నా
నా బ్రతుకును - బాగుచేయుమయ్యా 
||నిన్నే||

సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా 
నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా
కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా 
నా బ్రతుకును - బాగుచేయుమయ్యా
||నిన్నే||

-------------------------------------------------------------
CREDITS : Music : Jk Christopher
Lyrics, Vocals : Dr.P.Satish Kumar Garu
-------------------------------------------------------------