4794) అర్హతే లేని నాపై కృపను చూపితివే కుమారుడని నన్ను పిలచినావుగా

** TELUGU LYRICS **

అర్హతే లేని నాపై కృపను చూపితివే
కుమారుడని నన్ను పిలచినావుగా
తప్పిపోయి తిరిగినను తండ్రి నిన్ను విడచినను 
నన్ను విడువక నీ భుజముపై మోసినావుగా

ఎనలేని ప్రేమను నాపై నీవు చూపినావుగా
ఏ రీతిగా నీ కృపను నే వర్ణింతు యేసయ్య 
బలమైన నీ భుజములే నన్ను మోయుచుండగా 
బలమైన నీ కృపనునే చాటేదన్ దేవా

చాలును చాలును నీ కృపయే చాలును (4)
నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును 
కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును 
ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును 
ఎగిసే అలలపై నీ కృపయే చాలును

లోకాన్నే ప్రేమించినాను లోకాశలకు లోబడిపోయినను 
నా తండ్రి నీ ప్రేమే నన్ను మార్చి వేసెను 
స్నేహితులే విడచి వెళ్ళినను 
పందుల పొట్టే మిగిలియున్నను 
శాశ్వత ప్రేమే నా స్థితి మార్చి వేసెను
లేని వాటిని ఉన్నట్టుగా చేయు నా తండ్రి 
దోషినని నన్ను చూడక నా దరికి చేరితివి (2)
చాలును చాలును నీ  కృపయే చాలును (4)

పాపములో పట్ట పట్టబడితినే
అందరి మధ్యలో నిలువబడి తినే
రాళ్లు రువ్వి చంపవలెనని అనుకొంటిరే 
పాపమే లేని వారిని మొదట రాయి వేయమంటివే
నీ అద్భుత కనికరమే నాపై చూపించితివే
పాపినని నన్ను చూడక క్షమించినావయ్యా
పాపమిక నువ్వు చేయకని చెప్పినావయ్యా (2)

చాలును చాలును నీ కృపయే చాలును (4)
నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును 
కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును 
ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును 
ఎగిసే అలలపై నీ కృపయే చాలును

-------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Ps David Parla
Music : Deepak Cherian 
-------------------------------------------------------------