4740) ఎన్నికలోని వాడవేగా గతములోనే నీవు యెనలేని దీవెనలు పొందగ

** TELUGU LYRICS **

ఎన్నికలోని వాడవేగా గతములోనే నీవు 
యెనలేని దీవెనలు పొందగ నేడు పిలువబడినావు (2)
భయపడుమా యువజనమా - నీ జీవితము దేవుని దానము
తలచుట మరువకుమా - నీ బ్రతుకంత దేవుని భయము కలిగిన మేలు సుమా (2)

ఇవ్వబడిన సమయము సరిగా వినియోగించుము
అజ్ఞానివి కాబోకుము చీకటిమయమైపోకుము (2)
జ్ఞాన సంపదను పొందగ దైవ భయము కలిగుండుము (2)
బ్రతుకువెలుగుతో నింపుము   
||భయపడుమా||

విలువైనది ఈ ప్రాయము బలమైన పనులు చేయుము
ప్రభువునామ మహిమార్థమై నీ దినములు వెచ్చించుము (2)
నాట బడిన నీ స్థలములో ప్రభువు కొరకు ఫలియించుము (2)
తల కృపకు కీర్తి కలిగించుము
||భయపడుమా||

లోకములోని మోసము నీ లోపల చేర్చుటకోసము
శోధకుడుండెను చూడుము నీపై దాడి చేయును (2)
ఆజ్ఞలన్ని మరిపించుచు పాపము నీపై మోపును (2)
పతనమునకు పడద్రోయును 
||భయపడుమా||

-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Rev. K Kishore Kumar
Music & Vocals : Dr. J K Christopher & Bro. Philip 
-----------------------------------------------------------------------------