4696) సిలువలోని విలువనెరిగి జీవింప నేర్పుమా

** TELUGU LYRICS **

సిలువలోని విలువనెరిగి జీవింప నేర్పుమా
శ్రమలలోను సడలిపోని జయజీవితమీయుమా (2)
నీ సువాసనగా మమ్ము పరిమళింపచేయుమా (2)

ఆత్మలో దీనత్వము సాత్వీకమునునేర్పుమా
పొరుగువారిని ప్రేమతో ఓదార్చు ఓర్పును కూర్చుమా (2)
నీతిక్రియలను చేయగా మాలో ఆకలినుంచుమా (2)
సమాధానము పంచు నీ కుమారులనుగా పెంచుమా
||సిలువ||

ప్రాణమును అతి ప్రియముగా ప్రేమింపకుండుట నేర్పుమా 
ప్రియులని లోకస్తులన్ మది తలచుటను మాన్పింపుమా (2)
నీ ప్రేమ త్యాగము ప్రకటించు భారము పెంచుమా (2)
నీ కొరకు నిందలు హింసలు భరించు భాగ్యము నీయుమా
||సిలువ||

------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Kishore Kumar Kattula
Music & Vocals : Prasanth Penumaka & Shekinah Sam
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------------------------