4731) నా చాలిన దేవుడవు నీవే యేసయ్య నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

** TELUGU LYRICS **

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

మహిమ స్వరూపుడా నా యేసు దైవమా
మరణం జయించిన మదిలోన పావనుడ
నా సర్వం నిన్నె కొలిచెద నా యేసయ్య
మనసార నిన్నె చేరెద నా యేసయ్య
నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య
మహిమ స్వరూపుడా నా యేసు దైవమా
మరణం జయించిన మదిలోన పావనుడ

రాజులకు రాజు నీవు నన్నేలువాడవు నీవు
తల్లి మరచిన తండ్రి విడచిన విడువని నాధుడవు
ఈ లోక బందాలన్ని దూరమైపోయిన 
ఈ లోక సంపదలన్ని నేను కోల్పోయిన
నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య 

నా అడుగులు జారనీయక నడిపించు వాడవు నీవు
నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపువాడవు 
జిగటగల దొంగ ఊబిలో నే పడియున్నపుడు
నీ చేయి చాపి నన్ను లేవనెత్తి నావయ 
నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

---------------------------------------------------------
CREDITS : Vocals : Blessy John
Music, Lyrics, Tune : John zechariah
Youtube Link : 👉 Click Here
---------------------------------------------------------