4742) ఎవరున్నారయ్యా యేసయ్య నాకు నీవుంటే చాలయ్య నజరేయా

** TELUGU LYRICS **

ఎవరున్నారయ్యా యేసయ్య
నాకు నీవుంటే చాలయ్య నజరేయా
ఎంతకాలమైనా నీతోనే జీవితం ఏసయ్యా
ఎంతకాలమైనా నీతోనే జీవితం నజరేయ  
||ఎవరున్నారయ్యా||

ఎన్నాళ్లు ఉండవు ఓరువలేని బాధలు
ఇంకొన్నాళ్లే శ్రవించే కన్నీళ్లు (2)
భరించెదను జయము నిమ్మయా (2)
కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా
||ఎవరున్నారయ్యా||

శోధనలెదిరించే  శక్తినిమ్ము యేసయ్య
నాకున్న ధైర్యం నీవేనయ్యా (2)
నీతోడు  నీనీడ కావాలయ్యా (2)
కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా
||ఎవరున్నారయ్యా||

స్వస్థతను ఇచ్చే వైద్యుడవు నీవయ్యా 
నను లేవనెత్తే గొప్ప దేవుడవయ్యా (2)
నీ సాక్షిగా  నే నిలుతునయా (2)
కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా
||ఎవరున్నారయ్యా||

---------------------------------------------------------------------------------
CREDITS : Music : John Pradeep 
Tune & Vocals, Lyrics : Nissy John, Jayarao Gaddam
---------------------------------------------------------------------------------