4713) అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేడు నీ ప్రేమ

** TELUGU LYRICS **

అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేడు నీ ప్రేమ (2)
బంధుమిత్రులు ప్రాణహితులు (2)
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ (2)
||అమ్మ చూపలేదు||

చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను (2)
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి (2)
విడనాడనైతివి
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
||అమ్మ చూపలేదు||

నీదు ప్రేమ బంధము విడిచి - నిన్ను మరచి తిరిగితిని (2)
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి (2)
నిజ మమతవైతివి
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
||అమ్మ చూపలేదు||

-----------------------------------------------
CREDITS :
-----------------------------------------------