4653) త్రియేకదేవుడా మహెూపకారుడా నీ గుణాతిశయములనే

** TELUGU LYRICS **

త్రియేకదేవుడా మహెూపకారుడా నీ గుణాతిశయములనే
నేపాడి స్తుతియించెద నీదు మహిమలనే నా నోట వివరించెద

పగలు ఎండకు వాడిపోగా - నాకు నీడవైతివి (2)
గాలివానకు కొట్టబడగా - నా దాగుచోటుగా నీవుంటివి (2)
నన్నాదరించిన నేస్తమా నా శాంతి ప్రాకారమా 
కృపాసాగరా యేసయ్యా - మనసారా స్తుతియింతును

అలసిసొలసిన వేళలందు - సేదదీర్చినవాడవు (2)
గుండెపగిలినవేదనలందు - ఓదార్పునిచ్చిన నాదైవమా (2)
నాతోడై నిలచిన యేసయ్యా - నా రక్షణానందమా 
ఆప్యాయతపంచిన యేసయ్యా - బ్రతుకంతా సేవింతును

మధురప్రేమను చూపినాపై - నన్ను అకర్షించితివి (2)
స్నేహబంధము చూపినాలో నాప్రాణప్రియునిగా నీవైతివి (2)
నాజీవిత నాయక యేసయ్యా నన్నేలు మహరాజువు 
నాఆశ్రయ నాధుడా యేసయ్యా - నా ప్రేమపరిపాలకా

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------