4646) స్తుతి స్తోత్రం యేసయ్య ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను

** TELUGU LYRICS **

స్తుతి స్తోత్రం (2) 
యేసయ్య (2)
ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను  
నా సహాయకుడవు నీవే యేసయ్యా 
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను  
నా సహాయకుడవు నీవే యేసయ్యా (2)
కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను (2)
కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2)                                  
||ఆకాశం వైపు|| 

ఆకాశం పై నీ సింహాసనమున్నది  
రాజదండంతో నన్నేలుచున్నది (2)
నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించి  
నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి 
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా (2)
||ఆకాశం వైపు|| 

ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు  
ఆలోచన చేత నన్ను-  నడిపించు చున్నావు (2)
నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చి
నీ మహిమతో నన్ను నింపి - నీ దరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకంలో - ఏది నాకు అక్కరలేదయ్యా ||2||         
||ఆకాశం వైపు|| 

ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి  ఉన్నది 
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2)
నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపి
నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి (2)
||ఆకాశం వైపు|| 

ఆకాశం నీ మహిమను - వివరించుచున్నది అంతరిక్షం
నీ చేతి పనులు ప్రచురించుచున్నది (2)
భాష లేని మాటలేని - స్వరమే వినబడని 
భాష లేని మాటలేని స్వరమే వినబడనివి 
పగులు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది (2)
||ఆకాశం వైపు|| 

క్రొత్త ఆకాశం క్రొత్త భూమి  
నూతన యెరూషలేము - నాకై నిర్మించుచున్నావు (2)
మేఘ రథములపై - అరుదించి నన్ను కొనిపోవా  (2)
ఆశతో వేచియుంటిని - త్వరగా దిగి రమ్మయ్య (2)
||ఆకాశం వైపు|| 

కలవరము నోoదను (2)
కలవరము (2)
కలవరము నోoదను
కలవరము నోoదను - నిన్ను నమ్మియున్నాను (2)
కలత నేను చెందను - కన్నీలు విడువను (2)
ఆకాశం వైపు నా కన్నులెతు చున్నాను  
నా సహాయకుడవు నీవే యేసయ్యా (3)

-------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album (34) : Nityatejuda (నిత్యతేజుడా) 
-------------------------------------------------------------------------