4647) పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే

** TELUGU LYRICS **

పరిమళ తైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరాలలో నీవే
నిత్య సంకల్ప సారథి నీవే 
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే

ఉరుముతున్న మెరుపులవంటి
తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ
నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యం
నాపై చుపినావు
నీ మనసే అతి మధురం
అది నా సొంతమే   
||పరిమళ||

చిల్చ బడిన బందనుండి
కొదువ చీల్చి నదిలితివి
నిలువరమగు ఆత్మ శక్తితో
కొరత లేని ఫలములతో 
నను నీ రాజ్యమునకు పాత్రుని
చేయ ఏర్పరచు కుంటివే
నీ స్వాస్త్యములోనే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్థం వాడబడే
పాత్రను నేను 
||పరిమళ||

వెచియిన్న కనులకు
నీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగా నీవు
నాకోసం వాస్తవనీ
నిను చూసిన వేల నాలో ప్రాణం ఉద్వేగ బరితమై
నీ కౌగిట వొదిగి ఆనందంతో
నీలో మమేకమై
యుగ యుగయుగములలో నీతో
నేను నిలిచి పొదును 
||పరిమళ||

-------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album (34) : Nityatejuda (నిత్యతేజుడా) 
-------------------------------------------------------------------------