** TELUGU LYRICS **
నూతన సంవత్సరము దేవుని దయా కిరీటం
ప్రతి దినము నీ వాత్సల్యం మాపై చూపే దేవుడవు (2)
ప్రతి దినము నీ వాత్సల్యం మాపై చూపే దేవుడవు (2)
పలుమార్లు నిన్ను గాయపరచితిని
పలుమార్లు నీ త్రోవ నే త్రప్పితిని
ఓరిమితో నన్ను ఓర్చుకొనుచు
దిద్దుకొనుటకు సమయమిచ్చితివి
నీ కృపను చూపితిని
యేసయ్యా నీ కృపను చూపితిని
నిన్నటి వారము మేమందరము
మా దినములను పొడిగించితివి
కృపక్షేమములు మాకందించి
నేటివరకు మమ్ముంచితివి
నీ దయను చూపితివి
యేసయ్యా నీ దయను చూపితిని
నీ చిత్తమును జరిగించుటకు
నీ మార్గములను నాకు తెలియజేయుము
నూతన మనస్సును దయచేసి
పైనున్న వాటిని వెదకుటకు
మాకు నేర్పుమయా
యేసయ్యా నాకు నేర్పుమయా
--------------------------------------------------------------------------------
CREDITS : Tune & Music : Nissy Paul & K.j.W Prem
Lyrics & Vocals : Pastor P.Caleb & Family
--------------------------------------------------------------------------------